ప్రజాశక్తి - పర్చూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం సమరభేరి పోస్టర్‌ను సిపిఎం జిల్లా నాయకులు సిహెచ్ మజుందార్ ఆవిష్కరించారు. ఈనెల 30నుండి సెప్టెంబర్ 4వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఇంటింటికి కరపత్రం పంపిణీ, సంతకాల సేకరణ, సచివాలయాలలో అర్జీలు ఇవ్వడం, తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం జరిగిన సిపిఎం మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.400ఉన్న గ్యాస్ ధర రూ.1200కు చేరుకుందని అన్నారు. అన్ని రకాల ధరలు సామాన్యుల జీవితాలపై భారంగా మారాయని అన్నారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించడం ద్వారా 20వేల ఎకరాలకు సాగు, తాగునురు అందుతుందని అన్నారు. బిజెపి అధికారానికి వచ్చిన తర్వాత ధరలు పెరిగి మత విద్వేషాలతో మానసిక అశాంతి పెరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. సమావేశంలో సిపిఎం నాయకులు కె శ్రీనివాసరావు, బి చిన్నదాసు, ఎం డేవిడ్, రహీం పాల్గొన్నారు.










