Sep 23,2023 20:09

ప్రజాశక్తి - యలమంచిలి
మండలంలోని లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్‌ నేత బొబ్బిలి సత్యనారాయణ (65) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ మృతి వార్త తెలుసుకున్న సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బాతి జార్జి, నాయకులు కొప్పిశెట్టి సత్యనారాయణ, శీలం సత్యనారాయణ లక్ష్మీపాలెం వెళ్లి సత్యనారాయణ భౌతికాయాన్ని సందర్శించి ఎర్రజెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాల మాట్లాడుతూ సిపిఎంలో నిబద్ధత కలిగిన నాయకునిగా పనిచేసిన సత్యనారాయణ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.