Aug 11,2023 21:28

ప్రజాశక్తి - ఆచంట
             సిపిఎం ఆచంట సీనియర్‌ నాయకులు తోటపల్లి భూషణం భార్య సిపిఎం సానుభూతిపరురాలు తోటపల్లి ముసలమ్మ (93) అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె పెద్ద కుమారుడు తోటపల్లి సత్యనారాయణ ఆచంట మాజీ మండల కమిటీ సభ్యులుగా, సీనియర్‌ నేతగా సిపిఎం విస్తృతికి విశేష సేవలందిస్తున్నారు. ముసలమ్మ మృతదేహంపై సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్‌, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్‌విఎన్‌.శర్మ, సిపిఎం సీనియర్‌ నాయకులు మన్నె బ్రహ్మయ్య, మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజిబాబు, సిర్రా నర్సింహమూర్తి, కుసుమే జయరాజు, మచ్చా సుబ్బారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వద్దిపర్తి శ్రీను,బ ద్దా ప్రసాద్‌, పి.మోహనరావు, తలుపూరి బుల్లబ్బాయి, బొర్రా ధర్మారావు, ఇందుకూరి సూర్యనారాయణ రాజు, జిల్లా కార్యదర్శి బి.బలరాం, మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్‌ సంతాపం తెలిపారు.