ప్రజాశక్తి-కొల్లూరు: సిపిఎం సానుభూతిపరురాలు, కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు బిఎల్‌కె ప్రసాద్ తల్లి బోయపాటి వెర్రెమ్మ(100) అనారోగ్యంతో మంగళవారం మతి చెందిన విషయం తెలిసిందే. పలువురు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కమ్యూనిస్టు పార్టీ అంటే ఆమె చాలా ఇష్టపడేవారు. వెర్రెమ్మ మతదేహాన్ని సిపిఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు డి రమాదేవి మతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకటసుబ్బయ్య, సిపిఎం జిల్లా నాయకులు కృష్ణ మోహన్, సిపిఎం జిల్లా నాయకులు సిహెచ్ మణిలాల్, సిపిఎం అమృతలూరు మండల కార్యదర్శి అగస్టీన్, కొల్లూరు మండల కార్యదర్శి తోడేటి సురేష్, జిల్లా సహాయ కార్యదర్శి బొనిగల సుబ్బారావు, జి సుధాకర్, రామస్వామి నాగమల్లేశ్వరరావు, ఎం నాగేశ్వరరావు, ఎం సత్యనారాయణ, సిపిఐ జిల్లా నాయకులు రామాంజనేయులు, సిపిఐ నాయకులు బాలాజీ, టిడిపి మండల అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ, సిపిఎం కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కిష్కిందపాలెంలోని వారి పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు.










