
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు పట్టణానికి చెందిన కళాకారులు, సిపిఎం సానుభూతిపరుడు, యువజన సంఘాల్లో పనిచేసిన తూతిక అప్పలరాజు(50) మంగ ళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీలో కూడా చురుకుగా పనిచేసి ప్రజాసమస్యలపై పోరాడారు. ఆయన మృతికి సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్, మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్, యర్రా అజరుకుమార్, చల్లా సోమేశ్వరరావు సంతాపం తెలిపారు.