ప్రజాశక్తి-కాకినాడ రూరల్ సిపిఎం కాకినాడ రూరల్ మండల కన్వీరన్‌గా తిరుమలశెట్టి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. పార్టీ విస్తత స్థాయి సమావేశం సుందరయ్య భవన్‌లో సిహెచ్.విజరుకుమార్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ మాట్లాడారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం లేకుండా చేస్తోందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చే ముందు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను మోడీ ప్రభుత్వం ధారధాతంగా కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తోందన్నారు. అనంతరం రూరల్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కమిటీ సభ్యులుగా తొట్టిపూడి రాజా, సిహెచ్.విజరుకుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ ఎన్నికయ్యారు.










