ప్రజాశక్తి-నెల్లూరు : మోడి ప్రభుత్వం హరికిషన్ సింగ్ సూ ర్జిత్ భవన్ కు తాళాలు వేయటం పిరికిపంద చర్య అని సిపిఎం నాయకులు విమర్శించారు. ఆదివారం ఢిల్లీలోని హరి కిషన్ సింగ్ సూర్జిత్ భవనానికి కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా తాళాలు వేయటాన్ని ప్రజలు, ప్రజాతంత్ర వాదులంద రూ ఖండించాలంటూ సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప గుడి సెంటర్లో నిరసన చేపట్టారు. సిపిఎం రూరల్ కార్యదర్శి బత్తల కష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి నిరంకుశ ,నియంత్రత్వ పాలన హరి కిషన్ సింగ్ సూర్జిత్ భవనానికి పోలీసులు చేత తాళాలు వేయటంతో బట్ట బయలైందన్నారు. జి 20 ప్రతినిధులు సెప్టెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో సమావేశం కాబోతున్నా తరుణంలో ఢిల్లీలో ఆగస్టు 18, 19, 20 తేదీల్లో 70 ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, పౌర సంఘాలు ఇండోర్ మీటింగ్ పెట్టుకుని హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో విరు 20 పీపుల్స్ సెమినార్‌కు పిలుపునిచ్చాయన్నారు. ఈ జాతీయ సెమినార్‌లో భారతదేశం యొక్క స్థితిగతులు బిజెపి పాలన యొక్క బుల్డోజర్ విధానాలు, మణిపూర్లో హింసకాండలు, హర్యానా అల్లర్లు ,చర్చిలు ,మసీదులు ధ్వంసం చేయడం, దళితులు మహిళలు, మైనార్టీలపై దాడులు చేయటం, ప్రభుత్వ సంస్థల అమ్మి వేయడం తదితర సమస్యలపై చర్చిం చతలపెట్టాయన్నారు. సెమినార్ జరిగితే బిజెపి పాలన బండారం బయటపడుతుందనే భయంతో అక్కసుతో నిరంకుశత్వంగా అడ్డుకుందని విమర్శించారు. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. సిపిఎం రూరల్ కార్యదర్శివర్గ సభ్యులు కిన్నెర కుమార్, కొండా ప్రసాద్, పార్టీ రూరల్ కమిటీ సభ్యులు దేవతాటి సంపత్ కుమార్ పాల్గొన్నారు. శాఖా కార్యదర్శులు పి శ్రీనివాసులు, ఆటో యూనియన్ నాయకులు శంకర్, సీనియర్ నాయకులు ఏ. మోహన్ ఉన్నారు.










