Nov 02,2023 23:43

ప్రజాశక్తి - పర్చూరు
సిపిఎం ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం బాపట్ల జిల్లానాయకులు సిహెచ్‌ మజుందార్‌ కోరారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన సిపిఎం పోస్టర్‌ గురువారం ఆవిష్కరించారు. ఈనెల 8న పర్చూరులో జరిగే సిపిఎం రాష్ట్ర బస్సు యాత్ర బహిరంగ సభకు ప్రజలు హాజరు కావాలని కోరారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజలను చైతన్య చేయడానికి బస్సు యాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. ఈ యాత్ర నవంబర్ 8న ఉదయం 10 గంటలకు పర్చూరు చేరుకుంటుందని తెలిపారు. స్థానిక బొమ్మల సెంటర్లో జరిగే బహిరంగ సభకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గపూర్, పుణ్యవతి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బండారు చిన్నదాసు, సుబ్బారావు, జకరయ్య, డేవిడ్, బుల్లయ్య పాల్గొన్నారు.