Nov 01,2023 00:32

ప్రజాశక్తి - భట్టిప్రోలు
సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ బేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ భట్టిప్రోలు, అద్దేపల్లి గ్రామంలో మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన బస్సు యాత్ర ఈనెల 8న భట్టిప్రోలుకు విచ్చేస్తుందని తెలిపారు. యాత్రను ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు. నవంబర్ 14న విజయవాడలో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నాయని అన్నారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేపట్టడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని అన్నారు. బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజా సమస్యలను ప్రక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలతో కార్మికుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రజా రక్షణభేరి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి సుధాకర్, ఎం సత్యనారాయణ, మనోజ్ ఉన్నారు.