ప్రజాశక్తి ఇబ్రహీంపట్నం
స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాటలో భాగంగా నవంబర్ 12 నుంచి 24 వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కష్ణ తెలియజేశారు. ఇబ్రహీం పట్నంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సోమవారం సిపిఎం పోరుబాట గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దేవి కష్ణ మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీలో స్థానిక సమస్యలు ముఖ్యంగా మంచినీటి సమస్య పరిష్కరిం చాలని, రెండు పూటలా 29 వార్డుల ప్రజలకు సకాలంలో మంచినీరు అందిం చాలని లీకేజీలు అరికట్టాలని ఆయన కోరారు. ఇంటి నిర్మాణం కోసం వేసే ప్లాన్ విషయంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, అవినీతి అక్రమాలను అరికట్టాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్మించే కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అంతర్గత రోడ్లు మనమత్తులు చేయించాలన్నారు. మున్సిపాలిటీలో ప్రతి బజార్ నుండి చెత్తను సేకరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలకు తీవ్రమైన సమస్యగా పరిణమించిన బూడిద కాలుష్యం నివారించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణ కు కషి చేయాలన్నారు ప్రణాళిక బద్ధంగా బూడిద సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇలాంటి మరిన్ని ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టనున్న పోరుబాట కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కొండపల్లి టౌన్ కార్యదర్శి ఎం మహేష్, సభ్యులు చింతల శివ, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, అప్పారావు, వాసు, రమణమ,్మ కరుణమ్మ తిరుపతమ్మ నాయుడు నవీన్ గోపి పాల్గొన్నారు.










