Apr 24,2023 20:12

అవార్డును అందుకుంటున్న పాండవగల్‌ సర్పంచి ఉమాదేవి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
సిపిఎం నేతృత్వంలో జిల్లా ఉత్తమ పంచాయతీగా పాండవగల్‌ ఎంపిక కావడం ఆనందంగా ఉందని సర్పంచి ఉమాదేవి తెలిపారు. సోమవారం పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా కర్నూలులో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉత్తమ సేవలు అందించిన పంచాయతీలకు కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన, జడ్‌పి ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, జడ్‌పి సిఇఒ నాసర రెడ్డి, డిపిఒ నాగరాజు నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఉత్తమ పంచాయతీగా అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సర్పంచి ఉమాదేవి తెలిపారు. గత 20 ఏళ్లుగా గ్రామస్తులకు సేవలు అందిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు, ఉమాదేవి తెలిపారు. ఏ సమస్య వచ్చినా సిపిఎం ఆధ్వర్యంలో, గ్రామస్తుల సహకారంతో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో గ్రామానికి పేరు రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.