Apr 20,2023 00:03

ఘనంగా నివాళులర్పించారు.

ప్రజాశక్తి -పాడేరు: సిపిఎం నేతలకు పాడేరు లో బుధవారం అల్లూరి జిల్లా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి అప్పల నరస, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌, తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఈ నెల 17న మృతి చెందిన అనకాపల్లి మాజీ కౌన్సిలర్‌ సీనియర్‌ నేత మళ్ళ సత్యనారాయణతో పాటు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన సిపిఎం సీనియర్‌ నాయకులు వి,కృష్ణమూర్తి చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అప్పలనర్స మాట్లాడుతూ, నేతలిద్దరూ ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములై విశిష్ట సేవలందించారని కొనియాడారు. ప్రజా సమస్యలకు పరిష్కారం కోసం నిరంతరం పాటుపడిన వారి జ్ఞాపకాలు ఎప్పుడూ నిలిచి ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుందర్రావు, మంగమ్మ పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌:సిపిఎం సీనియర్‌ నాయకులు కృష్ణమూర్తి, మల్ల సత్యనారాయణమూర్తిల మృతి పార్టీకి తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, జిల్లా కార్యదర్శి సభ్యులు వి.ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం అరకువ్యాలీలోని గిరిజన సంఘం కార్యాలయంలో నేతల చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరి ఆశయ సాధనకు మనందరం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కె.రామారావు, మండల కమిటీ సభ్యులు పి.బాలదేవ్‌, కే.మగ్గన్న, ప్రసాద్‌, గాసి
బాలకృష్ణ.తదితరులు పాల్గొన్నారు.