ప్రజాశక్తి-అరకులోయరూరల్:మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ దండబాడు గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు చిట్టం నాయక్ మహాదేవ్ గురువారం అనారోగ్యంతో అరకులోయ ఏరియా ఆస్పత్రిలో మరణించారు. శుక్రవారం మహదేవ్ భౌతికకాయంపై అరకులోయ సిపిఎం మండల కార్యదర్శి కె.రామారావు, సిఐటియు మండల కార్యదర్శి పి.బాలదేవ్, సుంకరమెట్ట సర్పంచ్ జి.చిన్నబాబు సిపిఎం సీనియర్ నాయకులు కె.జగన్నాధంలు ఎర్ర జెండా కప్పి జోహార్లు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహాదేవ గిరిజన చట్టాల హక్కులు బాక్సైట్ పోరాటం, వ్యవసాయ పోడు భూములకు పట్టాలు, వి.ఎస్.ఎస్ భూములకు పట్టాల మంజూరుకు ముందుండి పోరాటం చేశారని కొనియాడారు. పంచాయితీ పరిధిలో ప్రతి గ్రామంలో రోడ్లు, సిసి రోడ్లు డ్రైనేజీలు మంచినీరు సదుపాయం కల్పించాలని పోరాడారని చెప్పారు. ఆయన మృతి ఉద్యమానికి తీరని లోటు అన్నారు. ఆయన స్ఫూర్తితో భవిష్యత్తులో గిరిజన ప్రాంతం సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పంచాయితీ నాయకులు సిహెచ్ గురుమూర్తి పి.రాజు, క్రిష్ణ, సిహెచ్ ప్రసాద్, కేశవ్, సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










