
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :తోటపల్లిగూడూరు మండలం (నరుకూరు) సిపిఎం కార్యదర్శి వేగూరు వెంకయ్యకు మాత వియోగం కలిగింది. అయన తల్లి వేగూరు రమణమ్మ (85) ఈ నెల 11న మతి చెందారు. రమణమ్మ భౌతిక ఖాయాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు, ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా, గోగుల శ్రీనివాసులు, దయాకర్, ఆలూరు తిరుపాలు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి గండవరపు శేషయ్య, కాల్తిరెడ్డి రవణమ్మ, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ట్రెజరర్ మధు సూదనమ్మ, మండల కమిటీ సభ్యులు లక్ష్మయ్య, బండి శౌరి, మస్తానయ్య, టిడిపి, వైసిపి నాయకులు తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. రమణమ్మ అంతిమ యాత్రలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.