Jun 12,2023 00:46

నివాళులర్పిస్తున్న మంత్రి నాగార్జున

ప్రజాశక్తి-భట్టిప్రోలు : మండల పరిధిలోని అక్కివారిపాలెం గ్రామంలో సిపిఎం నాయకులు కామ్రేడ్‌ గొర్రుముచు లాజర్‌ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు లాజర్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పార్టీలో నిబద్ధత కలిగిన వ్యక్తిగానే కుండానే కుటుంబాన్ని పార్టీకి అంకితం చేసిన వ్యక్తి లాజర్‌ అని పలువురు కొనియాడారు. లాజర్‌ మతదేహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి,రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున, బాపట్ల జిల్లా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ దేవినేని మల్లిఖార్జున రావు,రేపల్లె మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకటసుబ్బయ్య సిపిఎం, టిడిపి, వైసిపి, సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాజర్‌ మతదేహాన్ని గ్రామస్తులు, పార్టీ నాయకులు ఎర్రజెండాలు చేతబూని నినాదాలతో ర్యాలీగా అంత్యక్రియలకు తరలించారు.
లాజర్‌ ఆశయాలను సాధిద్దాం
నిబద్ధత కలిగిన సిపిఎం నాయకులు కామ్రేడ్‌ లాజర్‌ ఆశయాలను సాధిద్దామని సిపిఎం రాష్ట్ర నాయకులు డి. రమాదేవి అన్నారు. సిపిఎం బలోపేతానికి లాజర్‌ ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. లాజర్‌ కుటుంబానికి పార్టీ పూర్తి అండగా ఉంటుందన్నారు. లాజర్‌కు నివాళులర్పించిన వారిలో సిపిఎం జిల్లా నాయకులు టి.కష్ణమోహన్‌, వి.వెంకట్రామయ్య, టి.సురేష్‌, బి.అగస్టీన్‌, దీపాల సత్య నారాయణ, మురుగుడు సత్యనారాయణ, పి.నాగమల్లేశ్వర రావు, శ్రీనివాసరావు, సుబ్బారావు బట్టు నాగ మల్లేశ్వరరావు,భగవాన్‌దాస్‌, మనోజ్‌, అహరోను ,సిపిఐ నాయకులు జి.బాలాజీ, ఎంపిపి డివి. లాలితకుమారి, సర్పంచి నీలా ఉషారాణి రమేష్‌, టిడిపి నాయకులు సిరాజుద్దీన్‌, బట్టు మల్లికార్జునరావు పాల్గొన్నారు.