ప్రజాశక్తి -అనకాపల్లి:అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు ప్రాంతాల నుంచి జరిగిన బస్సు యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడలో ఈనెల 15న జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభకు తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని లోకనాథం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ బైక్‌ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, నెహ్రూచౌక్, రామచంద్ర థియేటర్, పార్క్ సెంటర్, అగ్గి మర్రి చెట్టు మీదుగా తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు జరిగింది. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ కేంద్ర బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలేశాయని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంటా శ్రీరామ్, జి.కోటేశ్వరరావు, ఆర్ శంకరరావు, జి నాయిన బాబు, ఏ రాజు, సిహెచ్.శివాజీ, బి.ఉమామహేశ్వరరావు, కె.తేలయ్యబాబు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : విజయవాడలో జరుగు సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం అచ్యుతాపురంలో బైక్ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. మోసయ్యపేటలో ప్రారంభమై రామన్న పాలెం, ఎదురువాడ, అచ్చుతాపురం మీదుగా స్థానిక నాలుగు రోడ్లు వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్.రాము, కె.సోమనాయుడు, రామ్‌కుమార్, దారబాబు, గురు నాయుడు పాల్గొన్నారు.
విస్తృత ప్రచారం
మునగపాక రూరల్ : ప్రచారక్షణ బేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు మునగపాక మండల కేంద్రం సోమవారం వ్యాపార కేంద్రాలు, ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వివి.శ్రీనివాసరావు, ఎస్.బ్రహ్మాజీ, టెక్కలి జగ్గ అప్పారావు, పెంటకోట రఘు కిషోర్, ఆడారి సాంబశివ పాల్గొన్నారు.
ప్రజా రక్షణ సభను విజయవంతం చేయాలి.
సబ్బవరం : ఈ నెల15 న విజయవాడ బహిరంగ సభకు తరలిరావాలని కోరుతూ సీపీఎం మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి ఆధ్వర్యాన ప్రచారం చేశారు. స్థానిక దుర్గమాంబ ముఠా కార్మికులతో సమావేశమై మాట్లాడారు. అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
పరవాడ : సిపిఎం బహిరంగ సభ వాల్ పోస్టర్‌ను పరవాడ మండలంలోని లంకలపాలెంలో సోమవారం ఆవిష్కరించారు. అనంతరం దుకాణాలకు వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, కర్ణం వెంకట్రావు, పి గంగరాజు, శ్రీను, పి అప్పారావు పాల్గొన్నారు.
నక్కపల్లి:విజయవాడలో ఈనెల15న జరగనున్న సిపిఎం బహిరంగ సభ జయప్రదం చేయాలని ఆ పారీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు కోరారు.మండలంలో పలు ప్రధాన ప్రాంతాల్లో సోమవారం బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికలను అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసమానతలు లేని అభివృద్ది కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణభేరి ముగింపు సందర్భంగా 15న విజయవాడ లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు .
రోలుగుంట:విజయవాడలో ఈ నెల 15న జరిగే ప్రజా రక్షణ భేరి సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు పిలుపునిచ్చారు. సోమవారం రోలుగుంట మండలం రత్నంపేట పంచాయతీ పనసపాడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం గోవిందరావు మాట్లాడుతూ, గిరిజన భూముల రక్షణ కోసం, అసమానతలు లేని అభివృద్ది కోసం జరిగే ప్రజారక్షణ భేరి సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.
కలెక్టరేట్ : ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న విజయవాడలో జరుగుతున్న ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు ప్రజానీకం పెద్దఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ తరగతుల ప్రజల సమస్యలపై ఇప్పటికే ప్రజారక్షణభేరి పేరిట మూడు బస్‌యాత్రలు అక్టోబరు 30 నుంచి సాగాయన్నారు. దీనికి ముగింపుగా ఈ నెల 15న ఉదయం 10 గంటలకు విజయవాడ బిఆర్‌టిఎస్ ఫుడ్ జంక్షన్ నుంచి ఎంబి స్టేడియం వరకు భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ ఉంటాయని తెలిపారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, తదితరులు పాల్గొంటారన్నారు.
రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు
గాజువాక : విజయవాడలో ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రజారక్షణభేరి సభను జయప్రదం చేయాలని కోరుతూ గాజువాక సిఐటియు కార్యాలయంలో రెడ్‌షర్ట్ వాలంటీర్లు కవాత్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక జోన్ నాయకులు ఎం.గుణశంకర్, డి.సాయికుమార్, బి.తేజ పాల్గొన్నారు.