మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండల సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కష్ణారెడ్డిపాలెం గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. పేడూరు శాఖ కార్యదర్శి ఈపూరు లక్ష్మయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండాను సిపిఎం సీనియర్ నాయకులు కొరివి నర్సయ్య ఆవిష్కరించారు. సిపిఎం జెండాను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య ఆవిష్కరించి మాట్లాడారు. ఇంకా సిఐటియు మండల కార్యదర్శి మారుబోయిన రాజా మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పచ్చ మధు, సెంటర్ ఆటో యూనియన్ అధ్యక్షులు నాశీన పరశురామయ్య, మోచర్ల రాధయ్య, తన్నీరు ప్రభావతమ్మ, కొరివి నరసయ్య, ఏసుదాసు ఉన్నారు.










