ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు
ప్రజాశక్తి -పెద్దకడబూరు
మండలంలోని కల్లుకుంట గ్రామంలో 11వ వార్డు మెంబర్‌గా సిపిఎం బలపరిచిన అభ్యర్థి హరిజన రాణెమ్మను ఆదరించాలని నాయకులు కోరారు. గురువారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. 11వ వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి రాణెమ్మను అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు. సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా నాయకులు రమేష్, సిఐటియు నాయకులు ఈరన్న పాల్గొన్నారు.










