Sep 15,2023 23:19

పెదనందిపాడు: పెదనందిపాడుకు చెందిన సిపిఎం అభిమాని మద్దూరు చిట్టెమ్మ (74) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఈమె కుమారుడు సిపిఎం శాఖ సభ్యులుగా, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిగాను పనిచేస్తున్నారు. ఆమె భౌతికకాయానికి సిపిఎం గుంటూరు జిల్లా కార్యాదర్శి పాశం రామారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నాయకులు డి రమేష్‌ బాబు, మద్దన వెంకటేశ్వర్లు, కొత్త శివరావు, చుక్కా యానాదులు, కొలక లూరి బాబు, కన్నెగంటి చందర్రావు తదితరులు నివాళులర్పించారు. శనివారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు పెదనందిపాడులో నిర్వహిస్తా మని కుటుంబ సభ్యులు తెలిపారు.