ప్రజాశక్తి - చీరాల
గుండెపోటు వచ్చిన వ్యక్తికి చికిత్స అందించే సిపిఆర్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఐ బాబురావు అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సిపిఆర్‌పై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెపోటు వచ్చి మనిషి పడిపోయిన సమయంలో అంబులెన్స్ వచ్చే వ్యవధిలో అందించే సిపిఆర్ ప్రథమ చికిత్స ఆ వ్యక్తిని బ్రతికించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సిపిఆర్ విధానం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి సమాజంలో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం లేదని అన్నారు. వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఆహారం పట్లపలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు మామిడాల శ్రీనివాసరావు, పోలుదాసు రామకృష్ణ, ప్రిన్సిపాల్ రమణమ్మ, సౌభాగ్య లక్ష్మి పాల్గొన్నారు.










