
ప్రజాశక్తి -కనిగిరి : సిపిఆర్‌తో గుండెపోటు మరణాన్ని నివారించవచ్చునని డాక్టర్ చైతన్య తెలిపారు. స్థానిక విజేత ఐఐటి అండ్ నీట్ అకాడమీ సెంటర్‌లో ఎబి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో బేసిక్ లైఫ్ సపోర్ట్ అవేర్నెస్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ప్రస్తుతం ఆధునిక కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్నట్లు తెలిపారు. సిపిఆర్‌ని ఉపయోగించడం ద్వారా 100కు 60శాతం మందిని ప్రాణాపాయం నుంచి కాపాడువచ్చునని తెలిపారు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని సిపిఆర్ ద్వారా ఎలా కాపాడాలనే అంశాన్ని ప్రాక్టికల్‌గా చూపించారు. విద్యార్థుల చేత చేయించి అవగాహన కల్పించినారు. మదర్ సేవాసమితి అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌ఎన్.రసూల్,పసుపులేటి అరుణోధర్ మాట్లాడుతూ మదర్ సేవ సమితి తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో డాక్టర్ కష్ణ చైతన్య తమ వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మదర్ సేవా సమితి సభ్యులు,విజేత ఐఐటి అండ్ అకాడమీ సెంటర్ అధ్యాపకులు డాక్టర్ చైతన్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహకులు షేక్ నాయబ్ రసూల్, మదర్ సేవ సమితి గౌరవాధ్యక్షుడు సయ్యద్ యాసిన్, ఆర్‌ఎంపి వైద్యులు పచ్చవ వెంకట చంద్రశేఖర్ ,డి.చెంచులు, న్యాయవాది సయ్యద్ షాహిద్, ఆర్యవైశ్య నాయకులు వాగిచర్ల వెంకటేశ్వర్లు, బీసీ సంఘం నియోజక వర్గ నాయకులు కేతనబోయిన పెద్దన్న ,ఈర్ల గురవయ్య, విజేత ఐఐటి అండ్ నీట్ అకాడమీ సెంటర్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.