Aug 17,2022 22:27

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సిపిఐ నేతలు

ప్రజాశక్తి- గాజువాక : విశాఖ నగరంలో జరగబోయే సిపిఐ రాష్ట్ర మహాసభలు, 26న బహిరంగసభను జయప్రదంచేయాలని ఆ పార్టీ నేతలు కోరారు. బుధవారం పెదగంట్యాడ సిపిఐ కార్యాలయంలో మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర మహాసభలలో ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన, ధరల నియంత్రణపై తీర్మానాలు చేస్తామన్నారు. 26న బహిరంగసభలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ, యేల్లేటి శ్రీనివాసరావు, పల్లెటి పొలయ్య, తాండ్ర కనకరాజు,అప్పారి విష్ణుమూర్తి,పెదపూడి దుర్గారావు, పాతయ్య, అచ్యుతరావు, వై దేముళ్లు పాల్గొన్నారు.