Sep 25,2022 23:59

ప్రజాశక్తి -ములగాడ : విజయవాడలో అక్టోబర్‌ 14 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు పశ్చిమ నియోజకవర్గం పరిధి మల్కాపురం గ్రామ మండల్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. గండి అప్పారావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో పైడిరాజు మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ పేదలు, కార్మికులు, కష్టజీవులు గురించి నిరంతరమూ ఉద్యమాలు చేస్తుందనానరు. దౌర్జన్యాలు దోపిడీలు నశించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని, రాష్ట్రములో చెత్త పన్ను రద్దు చేయాలని సిపిఐ పోరాడుతోందన్నారు. జాతీయ మహాసభలకు పశ్చిమ నియోజకవర్గం నుంచి 500 మంది విజయవాడకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సత్యాంజనేయ, గుడాల రాంబాబు, ఎన్‌వి.త్రినాథ్‌. పోతిన రాము, జి.రామకృష్ణ, కనకరాజు, డి.గోపి, బాలాజీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న పైడిరాజు