ప్రజాశక్తి-యంత్రాంగం
సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదంచేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు పలు చోట్ల మంగళవారం పోస్టర్లను ఆవిష్కరించారు.
మాధవధార : మాధవధార జంక్షన్లో పోస్టర్‌ను సిపిఐ ఉత్తర నియోజకవర్గం కార్యదర్శి పి.చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జరిగే మహాసభకు మహిళలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగభూషణరావు, వి.మల్లయ్య, ఎఐటియుసి నాయకులు కూన గోపాలం, టి.సన్యాసిరావు, కె.తవిటినాయుడు, బి.శంకరరావు, జి.వెంకటరావు, ఎస్.అప్పన్న, కె.కేశవరావు, వి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు
ములగాడ : మల్కాపురం గ్రామ మండలి వద్ద సిపిఐ పశ్చిమ నియోజకవర్గం సహాయ కార్యదర్శి గుడాల రాంబాబు పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాతీయ మహాసభలకు సిపిఐ సభ్యులు, సానుభూతిపరులు, అసంఘటిత రంగ కార్మికులు, బడుగుబలహీన వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గండి అప్పారావు, బి.వలసన్న, ఎన్‌వి.త్రినాథ్, కామేశ్వరరావు, కనకరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : గాజువాకలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎజె స్టాలిన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మహాసభలను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వై.శ్రీనివాసరావు, జి.ఆనంద్, అచ్యుతరావు పాల్గొన్నారు.










