Aug 28,2023 21:21

పోస్టరును ఆవిష్కరిస్తున్న నాయకులు

పోస్టరును ఆవిష్కరిస్తున్న నాయకులు
సిపిఐ బస్సు జాతా పోస్టర్ల ఆవిష్కరణ
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్రాన్ని రక్షించండి -దేశాన్ని కాపాడండి అనే నిదానదంతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ఈనెల 29 అనగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నగరానికి చేరుకుంటుందని సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్‌ సిరాజ్‌ పేర్కొన్నారు. సోమవారం సిపిఐ బస్సు జాతాను జయప్రదం చేయండి అని అంటూ ముద్రించిన వాల్‌ పోస్టర్లను ఆజాద్‌ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి సిరాజ్‌ మాట్లాడుతూ బస్సు యాత్ర నగరానికి చేరుకున్న అనంతరం ఆత్మకూరు బస్టాండు దగ్గరలో ఉన్న ఎబిఎంకాంపౌండ్‌ నుండి టౌన్‌ హాల్‌ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అదే రోజు సాయంత్రం 5 గంటలకు టౌన్‌ హాల్‌ నందు పెద్ద సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో ముఖ్యఅతిధులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకష్ణ , సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ,జిల్లా ఇంచార్జ్‌ డి. జగదీష్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ రవీంద్రనాథ్‌ తదితరులు హాజరౌతారన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షానవాజ్‌, ఇన్సాఫ్‌ జిల్లా అధ్యక్షులు అజీజ్‌ అహ్మద్‌, టి గోపాల్‌, సిపిఐ నాయకులు లతీఫ్‌ అహ్మద్‌, వెంకటేశ్వర్లు, సర్తాజ్‌, హాజీ అలీ, షాకీర్‌, రసూల్‌, వహీద్‌, తదితరులు పాల్గొన్నారు