నటిస్తున్న హీరో హీరోయిన్
ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లాలోని జి మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. శుక్ర, శని, ఆదివారం వరుసగా మూడు రోజులుగా షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినీనటుడు బ్రహ్మాజీ తనయుడు, సంజీవరావు కథానాయకుడుగా, అయూసా కధనాయకగా నటించే గుట్టుచప్పుడు చిత్రానికి పాట చిత్రీకరించినట్లు సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రానికి డైరెక్టర్‌గా మణింద్రన్, ప్రొడ్రూసర్ లివింగ్టన్, డాన్స్ మాష్టర్‌గా ప్రశాంత్ పని చేస్తున్నారు. జలపాతంలో విద్యుత్ అంకంరణలతో చిత్ర యూనిట్ హీరో, హీరోయిన్‌ల మధ్య పాటను చిత్రీకరించారు.










