Nov 25,2022 23:45

సినీ నివాళి అర్పిస్తున్న అభిమాన సంఘం సభ్యులు

ప్రజాశక్తి -కొత్తకోట: సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం కృష్ణ వేష దారుడు, పలు సాంఘిక నాటకాలతో పాటు రికార్డింగ్‌ డాన్స్‌ల్లో ఆయనను అనుకరించిన కొత్తకోట గ్రామానికి చెందిన అభిమాని మల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో స్థానిక మెయిన్‌ రోడ్డులో ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్‌ కోన లోవరాజు, ఉప సర్పంచ్‌ పందల దేవ, వైసీపీ మండల కార్యదర్శి శీలం శంకరరావు తదితరులు మాట్లాడుతూ సుమారు 350 చిత్రాలకు పైగా నటించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. అనంతరం కృష్ణ చిత్ర పటానికి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అభిమాన సంఘం సభ్యులు పాల్గొన్నారు.