Aug 02,2021 17:20

బెంగుళూరు : శాండల్‌వుడ్‌ నిర్మాత కె.సుధాకర్‌ కు రూ.5 కోట్ల జరిమానాతో పాటు ఏడాది జైలుశిక్ష ఖరారైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాసన్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త నుండి లే అవుట్ నిర్మాణాల కోసం సుధాకర్ రూ.2.90 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని సినిమాలకు పెట్టుబడి పెట్టి నిర్మించిన సినిమాలు సక్సెస్ కాలేదు. దీంతో అప్పులు చెల్లించలేక పారిశ్రామికవేత్త రాజీ చేసుకున్న సుధాకర్‌ చెక్కులు ఇచ్చారు. అవి బౌన్స్‌ కావడంతో పారిశ్రామికవేత్త హాసన్‌లోని నాల్గవ జేఎంఎఫ్‌సీ కోర్టును ఆశ్రయించారు. 2020 జనవరి 27న కోర్టు రూ.5 కోట్ల జరిమానాతో పాటు ఏడాది జైలుశిక్షను ఖరారు చేసి తీర్పునిచ్చింది. జేఎంఎ్‌ఫసీ కోర్టు తీర్పుపై సుధాకర్‌ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ జూలై 16న కొట్టేయడంతో గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం శిక్షార్హుడయ్యాడు. దీంతో ఆయనకు అరెస్టు వారెంట్‌ జారీ అయింది. సుధాకర్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నామని హాసన్‌ జిల్లా పోలీసులు ఆదివారం ప్రకటించారు. కథా విచిత్ర, హులిదుర్గ వంటి సినిమాలు నిర్మించిన దర్శకుడు కె.సుధాకర్‌ పై మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.