Mar 13,2023 23:29

సింహగిరి రైల్వే కాలనీలో పర్యటిస్తున్న డిఆర్‌ఎం అనుప్‌ సత్పతి

ప్రజాశక్తి-విశాఖపట్నం : తాటిచెట్లపాలెంల సమీపంలోని సింహగిరి రైల్వే కాలనీని వాల్తేరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ అనుప్‌కుమార్‌ సత్పతి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కాలనీలోని సౌకర్యాలను పరిశీలించేందుకు సీనియర్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ ఎస్‌కె.సారంగి, ఎలక్ట్రికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీలోని ప్రాథమిక సౌకర్యాలు, పారిశుధ్యం, భద్రత, రైల్వే క్వార్టర్ల పరిస్థితిని మెరుగుపరిచేందుకు వీక్షించారు. కాలనీలోని ఉద్యోగుల కుటుంబాలతో మాట్లాడి సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఇళ్లను పరిశీలించి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం డిఆర్‌ఎం మాట్లాడుతూ, ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం, ఇళ్ల స్థితిగతులను తెలుసుకోవడం, సౌకర్యాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడమే తనిఖీల ఉద్దేశమన్నారు.