ప్రజాశక్తి- సింహాచలం: సింహాచలం దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు విజయనగరంలో ఆవిష్కరించారు. తన స్వగృహంలో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు విడుదల చేశారు. సింహాచల దేవస్థానంలో ప్రత్యేక పూజలు అనంతరం దేవస్థానం ధర్మకర్తలమండలి సభ్యులు అప్పన్న క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసచార్యులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజ్, చందు యాదవ్, దొడ్డి రమణ, శ్రీదేవి, శేషారత్నం, సంపంగి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అప్పన్న క్యాలెండర్ అమ్మకాల ప్రారంభం
సింహాద్రి అప్పన క్యాలెండర్ అమ్మకాలను దేవస్థానం అధికారులు ప్రారంభించారు. కొండపై సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ కౌంటర్, రూ.300 దర్శన టిక్కెట్ కౌంటర్, మే ఐ హెల్ప్‌యు కౌంటర్‌తోపాటు కొండదిగువన బస్‌స్టాండ్ వద్ద, గోపాలపట్నం, గోశాల పెట్రోల్ బంకుల వద్ద ఒక్కొక్కటీ రూ.25కు క్యాలెండర్ అమ్మకాలను ప్రారంభించారు.










