Sep 18,2023 00:20

సింహాచలం ఇఒగా బాధ్యతలు స్వీకరిస్తున్న సింగాల శ్రీనివాసరావు

ప్రజాశక్తి-సింహాచలం: సింహాచలం దేవస్థానం నూతన ఇఒగా సింగాల శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌ఛార్జి ఇఒగా ఉన్న వి.త్రినాధరావు నుంచి సోమవారం కొండపైన ఆస్థాన మండపం వద్ద బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సింగాల శ్రీనివాసరావు దంపతులు సింహాద్రి అప్పన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం బాధ్యతలను స్వీకరించారు. అక్కడి నుంచి నేరుగా కొండ దిగువన ఉన్న కార్యాలయానికి వచ్చి సిబ్బందితో పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఆగమ పాఠశాలకు వెళ్లి విద్యార్థులు వివరాలు, వారికి అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆఫీస్‌ పరిసరాలను పరిశీలించి తదుపరి కొండపైకి వెళ్లి అన్నదానంలో భక్తులకు అందిస్తున్న ఆహారం పరిశీలించారు. అన్నప్రసాదం ఎలా ఉందని భక్తులనడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సహాయ కార్య నిర్వహణాధికారి రమణమూర్తి ఇఇలు శ్రీనివాస్‌రాజు, రాంబాబు, అన్నదానం సూపరింటెండెంట్‌ పాలూరి నరసింహారావు తదితరులు ఉన్నారు.