Oct 17,2023 21:20

గ్రామస్తులకు బ్రోచర్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే కళావతి

ప్రజాశక్తి -పాలకొండ : మండలంలోని సింగన్న వలస పంచాయతీ మల్లన్నగూడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, శాసనమండలి ప్రభుత్వ విప్‌ పాలవలస విక్రాంత్‌ గ్రామగ్రామానికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలతో కూడిన కరపత్రాలు అందజేశారు. వైసిపి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి కణపాక సూర్య ప్రకాశరావు, నగర పంచాయతీ వైసిపి అధ్యక్షులు వెలమల మన్మధరావు, బలగ మన్మధ రావు, గుంటుపల్లి కృష్ణ, బలగ కష్ణంనాయుడు, బలగ రమేష్‌, మామిడి రమేష, కోడి అప్పన్న పాల్గొన్నారు.