చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తున్నజెడ్‌సి
ప్రజాశక్తి -భీమునిపట్నం : నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం ఉన్నందున, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని జెడ్‌సి ఎస్.వెంకటరమణ సూచించారు. బుధవారం ఒకటోవార్డు బంగ్లామెట్ట వద్ద చెత్తసేకరణపై మహిళలకు అవగాహన కల్పించారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా ఉంచి, ఇంటి వద్దకు వచ్చే క్లాప్ వాహనాలకు అందించాలన్నారు.ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎఎంహెచ్‌ఒ వి.ప్రసాదరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బి.మహాలక్ష్మినాయుడు, వార్డు సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ చెత్త సేకరణకు మూడు రకాల డస్ట్‌బిన్లను అందజేశారు.










