
ప్రజాశక్తి - నూజివీడు రూరల్
మండలంలోని గొల్లపల్లి గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఎంఎల్‌ఎ మేక వెంకట ప్రతాప్ అప్పారావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శిరీష, అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.