సూరవరపుపల్లిలో నిర్మించిన సిమెంట్ రోడ్డు
యద్దనపూడి : మండల పరిధిలోని సూరవరపుపల్లి గ్రామంలో రూ.11లక్షలతో సిమెంట్ రోడ్డును నిర్మించినట్లు గ్రామ సర్పంచి సన్నెబోయిన వెంకటప్పయ్య తెలిపాడు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రూ.8లక్షలు,15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3లక్షలు కలిపి మొత్తం రూ.11 లక్షలతో 220 మీటర్ల పొడవున రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న వైసిపి పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణ మోహన్‌కు గ్రామ సర్పంచి సన్నెబోయిన వెంకటప్పయ్య,ఉపసర్పంచి కనకం వీరాంజనేయులు ధన్యవాదాలు తెలిపారు.










