
షాపును ప్రారంభించిన ఫ్యాబ్రిక్ కంపెనీ అధినేత బోడెపూడి అప్పారావు
ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం : కేతనకొండలో నూతనంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సిమెంట్ అండ్ టైల్స్ షాప్‌ను సోమవారం ప్రారంభించారు. కొమ్మూరు రాజారావు ఏర్పాటు చేసిన షాపును ఫ్యాబ్రిక్ కంపెనీ అధినేత బోడెపూడి అప్పారావు విజయదశమి పండుగ నాడు ప్రారంభించారు. మొదటిగా కొనుగోలు చేసి షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపి దినదిన అభివద్ధి చెంది మంచి లాభాలు చేకూరాలని ఆ దుర్గమ్మను వేడుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మూరు ఆచారావు, సాయి, ఇబ్రహీంపట్నం మండల కోబి ఆప్షన్ మెంబర్ పఠాన్ నాగులు మీరా తదితరులు పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.