Sep 03,2023 23:49

నృత్యాలు ప్రదర్శిస్తున్న చిన్నారులు

ప్రజాశక్తి- పిఎం.పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో నవ్య డ్యాన్స్‌ అకాడమీచే శాస్త్రీయ, జానపద నృత్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాగతం స్వాగతం, మహా గణపతిం, స్వామి రారా, జయ జనార్ధన, శాంతాకారం, ముకుందా ముకుందా, ముద్దు గారే యశోద, కన్నా నిధురించరా తదితర అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమనికి నవ్య నృత్య దర్శకత్వం వహించగా శరణ్య, వర్ష, దివ్య, శిరీష, హేమ, అమృత, దివ్య, సత్య, కీర్తన, శ్రావ్య, మౌనిక, కుమారి, జ్యోషిత, త్రిషిత, మోహన చరిత, లశ్యాశ్రీ, హరిణి, ధితశ్రీ, ప్రణతి, శిరీష, సూర్య, అక్షయ, దేవా హర్షిణి, తేజశ్రీ, అక్ష్య, కనక మహాలక్ష్మి కళాకారులు నృత్యాలు ప్రదర్శించారు. వీరి నృత్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.