Aug 27,2023 23:24

నృత్య ప్రదర్శనలిస్తున్న చిన్నారులు

ప్రజాశక్తి పిఎం.పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో నాట్య తరంగిణి డ్యాన్స్‌ అకాడమీచే శాస్త్రీయ, జానపద నృత్యాల కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూషికవాహన, వినాయక విగేశ్వర, మహా గణపతిం, కృష్ణ మా ఇంటికి, అదివో అల్లదివో, ఇదిగో భద్రాద్రి, కొలువైతివా, శ్యామల మీనాక్షి, చంద్ర చూడ, దశావతారాలు, జయ గణేశాయ తదితర అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌.లీలావతి నృత్య దర్శకత్వం వహించగా విష్ణువర్ధన్‌రెడ్డి, శాన్వి, ఇశ్విత, రాణి, చంద్రణి, మాధురి, దేదీప్య, చందు, ఇందు, మేధా, హర్షిణి ప్రియ, భవ్య కళాకారులు నృత్యాలు ప్రదర్శించి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.