శాస్త్రీయ నృత్యం చేస్తున్న చిన్నారులు
ప్రజాశక్తి -పిఎం.పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీ నటరాజ నాట్యమండలిచే శాస్త్రీయ, జానపద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక కౌత్వం, ఘాటనృత్యం, రామ చక్కని సీత, శివాష్టకం, వేయి నామాల వాడు, ఓం గణపతి పతయే నమ్ణ, ఒక పరి ఒక పరి, వదినకు ఒకసారి, రెలారే రెలరే తదితర అంశాలను ప్రదర్శించారు. జస్మితా, స్నేహ, సింధు, మహిశ్రీ, హాసిని, వర్షిత, జిస్మిత కళాకారులు నృత్యాలను ప్రదర్శించారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.










