May 21,2023 23:46

నృత్యాలు ప్రదర్శిస్తున్న చిన్నారులు

ప్రజాశక్తి- పిఎం.పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో శ్రీకాకుళం సోంపేట మండలానికి చెందిన శ్రీ నటరాజ నాట్యమండలిచే శాస్త్రీయ, జానపద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక స్తుతి, అన్నమయ్య కీర్తనలు, బ్రహ్మంజలి, వేయి నామాలు వాడు, ఝట నృత్యం, శివస్తుతి, కోయిలారే, ఘల్లు, ఘల్లు, వదినకు ఒకసారి, మూషిక వాహన తదితర అంశాలను ప్రదర్శించారు. వాసు దేవ్‌, స్వాతి, స్వప్న, జస్మిత, శ్రీలక్ష్మి, ఇక్షిత, ఆశ్రీత, సుదిక్ష, స్నేహ, హాసిని, ఇశ్రిత, అక్షయ, లోచని కళాకారులు నృత్యాలు ప్రదర్శించారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.