శిల్పారామంలో నృత్యాలు చేస్తున్న కళాకారులు
ప్రజాశక్తి- పిఎం పాలెం: వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మధురవాడ శిల్పారామంలో జోష్ డాన్స్ అకాడమీచే శాస్త్రీయ, జానపద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి భజే భజేహం, భావములోన బాహ్యమునందున, గరుడ గమన, నోమి నోమన్నలారా, గాజులసప్పుడు, వదినకు ఒకసారి, లాల గూడా, మొక్కజొన్న తోటలో తదితర అంశాలను ప్రదర్శించారు. కళాకారులు పల్లవి, కుశాల్, లోహిత, యక్షిత, నిహార్, హర్షిత, దామిని, శాన్వి, రిథమ్, అమృత, కేశవి, జోస్య, హరిక, సారిక, రోషిని, యస్మిత నృత్యాలను ప్రదర్శించారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.










