నృత్యం చేస్తున్న చిన్నారులు
ప్రజాశక్తి- పిఎం పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో సిద్ధేంద్రయోగి నాట్యాలయంచే శాస్త్రీయ, జానపద నృత్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాయక, ఐగిరి నందిని, ముద్దుగారే యశోద, తిరుతిరు గణనాథ, రాజాం కొండ మీద, మొక్క జొన్న తోటలో, నోము నోమన్నల, కోయిలారే, గాజుల చప్పుడు తదితర అంశాలను ప్రదర్శించారు. కళాకారులు శాన్వి, గామిని, శ్రీవల్లి, హాస్య, అక్షర, కీర్తి, పల్లవి, మోక్ష, సంజన, మౌనిక, సంధ్య, మన్విత, కుషాల్, చందు, కోమల, లలిత్, యశశ్విని నృత్యాలను ప్రదర్శించారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.










