నృత్యాలను ప్రదర్శిస్తున్న చిన్నారులు
ప్రజాశక్తి పిఎం.పాలెం : మధురవాడ శిల్పారామంలో నాట్య దీపిక డాన్స్ అకాడమీచే సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాగణపతిం, జగతి సిగలో జాబిలమ్మ, దండాలు దండాలు అమ్మోరు తల్లి, ముకుందా ముకుందా, రాజాం కొండ మీద, ఘల్లు ఘల్లు జోడెడ్ల బండి, లాలా గుడ లంబడి పిల్ల, మొక్క జొన్న తోటలో తదితర అంశాలకు గిషితశ్రీ, యశశ్విని, జాహ్నవి, యశ్మిత, సాత్విక, రోనిత, మొక్షిధర్, లలిత్, నిహల్, కోమల్, చందు నృత్యాలను ప్రదర్శించారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.










