ప్రజాశక్తి- పిఎం.పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో ఆజాది కా అమృత్ మహాత్సవ్ కార్యక్రమంలో భాగంగా జోష్ డాన్స్ అకాడమి ఆధ్వర్యాన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మీ విశ్రాంత ఉద్యోగి పి.సత్యనారాయణ శర్మను సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వందేమాతరం, జగతి సిగలో జాబిలమ్మకు వందనం, మా తుజే సలాం, ఏ దేశమేగినా ఎందుకాలిడిన పొగడర నీ తల్లి భూమి భారతిని, కోలువైతివా రంగసాయి, బ్రహ్మాంజలి, తెలుగమ్మ తెలుగమ్మ నీకు వేవేల వందనాలు, భారత మాత నీకు జేజేలు, గాజుల సవ్వడి, ఘల్లు ఘల్లు, జొడెడ్ల బండి అనే అంశాలను చిన్నారు ప్రదర్శించారు. హర్షిత, సంజన, మౌనిక, సంధ్య, కుషాల్, శివ, కేశవ్, మన్విక, హారిక, సారిక, మోహన, అన్నపూర్ణ, హర్షిత, చందు కళాకారులు నృత్యాలను ప్రదర్శించారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.










