ప్రజాశక్తి -పిఎం పాలెం : మధురవాడ శిల్పారామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. శిల్పారామం జాతరలో రూ.4 లక్షల జివిఎంసి నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. శిల్పారామంలో ప్రైవేటు సంస్థతో రెండేళ్ల కాలపరిమితితో ఒప్పందం కుదుర్చుకొని రూ.2.80 కోట్లతో ఏర్పాటుచేసిన వాటర్ వరల్డ్ పార్క్‌నూ ఆయన ప్రారంభించారు. శిల్పారామంలో యోగ చేసుకునేందుకు వీలుగా దివీస్ సిఎస్‌ఆర్ నిధులు రూ.16 లక్షలతో యోగ వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం విశాఖను పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించినందుకు ఆయన చిత్ర పటానికి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యాన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జోన్ టు జోనల్ కమిషనర్ కె.కనకమహలక్ష్మి, వాటర్ వరల్డ్ సంస్థ మేనేజింగ్ చైర్మన్ జానకి రమేష్ బెహరా, దివీస్ సిఎస్‌ఆర్ మేనేజర్ సురేష్, జాతర ఎఒ విశ్వనాథ్‌రెడ్డి, 6, 7 వార్డుల వైసిపి అధ్యక్షులు బొట్టా అప్పలరాజు, పోతిన శ్రీనివాస్, నాయకులు ఇఎన్‌ఎస్ చందర్రావు, అల్లాడ లింగేశ్వరరావు, గాదె రోశి, పిల్లా కృష్ణమూర్తిపాత్రుడు, పిల్లా సూరిబాబు, పిల్లా రమణ, గుంటుబోయిన సంజీవ్ యాదవ్, సియ్యద్రి కనకరాజు, కురిటి లోహిత్, పోతిన మూర్తిబాబు, పోతిన యల్లాజి, జగ్గుపిళ్లి నరేష్, జగ్గుపిల్లి సాయి, అల్లాడ లింగేగేశ్వర రావు, కోండపిల్లి వరలక్ష్మి, ముందుండి రాజేశ్వరి, పోతిన సురేష్, రాజంనాయుడు తదితరులు పాల్గొన్నారు.










