Oct 03,2022 00:03

నృత్యాలు చేస్తున్న విద్యార్థినులు

ప్రజాశక్తి- పిఎం పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో నాట్య దీపిక డాన్స్‌ అకాడమీచే సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష వందనం, అష్టలక్ష్మీ వైభవం, ఐగిరి నందిని, జయ జనార్ధన, రామాయణ సంభవం, అన్నమాచార్య కీర్తనలు, ముకుంద ముకుంద తదితర అంశాలను ప్రదర్శించారు. రేవతి, ప్రణయ రాగ, శ్రీ సాయి స్నిగ్ధ, దీక్ష, హర్షిత, తేజస్విని, మానస నృత్యాలు ప్రదర్శించారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.