Aug 07,2022 23:28

నృత్యం చేస్తున్న చిన్నారులు

ప్రజాశక్తి -పిఎం పాలెం : వారంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మధురవాడ శిల్పారామంలో ఆదివారం సాయంత్రం శ్రీ సిద్ధేంద్రయోగి కళా నట్యాలయం వారిచే కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బ్రహ్మంజలి, బ్రహ్మమొక్కటే, కొలువైతివా రంగ సాయి, ముద్దుగారే యశోద, బాలగోపాల తరంగం, నోమి నోమన్నలార చందమామ, ఘల్లు ఘల్లు, జోడెడ్లబండి చూడు, రాజం కొండ మీద, వదినకు ఒకసారి, కోయిలారే, శీలం సాయి అనే అంశాలను ప్రదర్శించారు. వినిష, లేఖశ్రీ, మౌనిక, సంధ్య, మోక్ష, మన్వితా, రిహన్విత, సమ్మిత, సంజన, జాహ్నవి, మాషిత తదితర కళాకారులు నృత్యాలను ప్రదర్శించారని శిల్పారామం పరిపాలనాధికారి విశ్వనాథ్‌ రెడ్డి తెలిపారు.