శిల్పారామంలో నృత్యాలు ప్రదర్శిస్తున్న చిన్నారులు
ప్రజాశక్తి- పిఎం.పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో లలిత డ్యాన్స్ అకాడమీచే శాస్త్రీయ, జానపద నృత్యాలు నిర్వహించారు. మూషిక వాహన, గరుడ గమన, ముద్దుగారే యశోద, గణ నాయక, ఐగిరి నందిని, పలుకే బంగారమాయెనా, కృష్ణా మా ఇంటికి, శివ తాండవం తదితర అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమనికి ఎం.లలిత, జి.సోని నృత్య దర్శకత్వం వహించగా అనన్య, పవిత్ర, లీలా, సౌమ్య, భావన, సిరి చందన, దివ్య, హేమ సుధ, దివ్యశ్రీ, నిహారిక, నిత్య, లక్ష్మి, రేఖ, వర్షిణి, నిత్య, సంయుక్త, ఐశ్వర్య, నిఖిత, హరిణి, హేమశీ కళాకారులు నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్ రెడ్డి తెలిపారు.










