Sep 04,2022 23:24

నృత్యాలను ప్రదర్శిస్తున్న చిన్నారులు

ప్రజాశక్తి పిఎం పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో నాట్య తరంగిణి డ్యాన్స్‌ అకాడమీచే సాంస్కృతిక, జానపద నృత్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూషిక వాహన, గణనాయక, జయ జయ, కృష్ణమ్మ ఇంటికి, దేవుళ్ళే మెచ్చింది, మాణిక్యవీణ, వందేమాతరం, బ్రహ్మాంజలి తదితర అంశాలను ప్రదర్శించారు. లాస్య, సౌమ్య, ఆకాంక్ష, హేమశ్రీ, యశస్వి, శ్రీనిధి, ఆశ్రీత, తేజస్వి, దివ్యంజలి, జ్యోతిక, ప్రణవి, గాయత్రి, మేఘన, చిన్నిప్రియ నృత్యాలను ప్రదర్శించారు. శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.