ప్రజాశక్తి -కంచరపాలెం: కంచరపాలెం బిఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు అంశాల్లో శిక్షణ పొందిన వారికి సోమవారం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ విశాఖపట్నం అధ్యక్షులు మధు పాల్గొని, యోగాతోపాటు బహుముఖ సేవా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న బిఎన్‌ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఫౌండేషన్ కన్వీనర్ బుజ్జి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రోటరీ క్లబ్ మహిళ కార్యక్రమాల ప్రధాన నిర్వాహకురాలు మోదమాంబిక, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ, ఫౌండేషన్ ప్రధాన నిర్వాహకులు ఎస్ అప్పలరాజు, టైలరింగ్ టీచర్ పి సావిత్రి, కంప్యూటర్ కోర్సుల ఫ్యాకల్టీ కె ప్రభాకర్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్యాకల్టీ సతీష్, స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ కష్ణారావు, డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులు విజయ, హోమియో డాక్టర్ నమ్మి సరళ, విసిసి నిర్వహణ సహాయకులు పి రామారావు, పాల్గొన్నారు. ఫౌండేషన్ సేవలకు ఆర్థికచేయూతనందిస్తునన రోటరీ క్లబ్‌కు కన్వీనర్ బుజ్జి ధన్యవాదాలు తెలిపారు. వంది మంది విద్యార్థులు, మహిళలకు సర్టిపికెట్లను అందజేశారు.










